బీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలు : Ponguleti Srinivasa Reddy
బీఆర్ ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలని, ఆ రెండు పార్టీల అనుబంధం ఫెవికాల్ కంటే దృఢమైందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
దిశ, శేరిలింగంపల్లి : బీఆర్ ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలని, ఆ రెండు పార్టీల అనుబంధం ఫెవికాల్ కంటే దృఢమైందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాహుల్ జోడో యాత్ర చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ శ్రీరాం నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో -కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవితో కలిసి రఘునాథ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
రఘునాథ్ యాదవ్ లు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీఆర్ ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఒకటేనని, వారి బంధం చాలా దృఢమైందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆడ బిడ్డలకు రూ.500లకే గ్యాస్ కనెక్షన్ అందిస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, అలాగే రూ.4 వేల పింఛన్ ఇస్తామని తెలిపారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదని, తెలంగాణ రాష్ట్రాన్ని
ఇచ్చింది కాంగ్రెస్.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు రాములు గౌడ్, ఘఫూర్, నజాం, సలీం, భరత్ యాదవ్, రాజేష్ యాదవ్, కిరన్ రెడ్డి, అరుణ యాదవ్, మణెమ్మ, పవన్, హమీద్, ఇంరోజ్, వెంకటేశ్వర రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పార్టీ శ్రేణులు, మహిళ నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.