పద్మారావు గౌడ్ ఇచ్చిన హామీని రెండు సార్లు విస్మరించారు : బండ కార్తీక చంద్రారెడ్డి

ప్రజలకు కనీస వైద్యసౌకర్యాలు అందించడంలో స్థానిక ఎమ్మేల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విఫలం చెందారని నగరమాజీ మేయర్ బీజేపీ నాయకురాలు బండ కార్తీక చంద్రారెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-04-11 12:47 GMT

దిశ, సికింద్రాబాద్ : ప్రజలకు కనీస వైద్యసౌకర్యాలు అందించడంలో స్థానిక ఎమ్మేల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విఫలం చెందారని నగరమాజీ మేయర్ బీజేపీ నాయకురాలు బండ కార్తీక చంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో మంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా రెండుదఫాలుగా అధికారంలో ఉండి కూడా తార్నాక డివిజన్ మానికేశ్వర్ నగర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. చేయిచేయి కలుపుదాం హాస్పిటల్ నిర్మిదాం అంటూ మానికేశ్వర్ నగర్ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారం 7వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి బండ కార్తీక చంద్రారెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నికల సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటు పై ఇచ్చిన హామీని రెండు పర్యాయాలు అధికారంలో ఉండి కూడా పద్మారావు గౌడ్ విస్మరించారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బస్తీ వాసుల న్యాయమైన డిమాండ్ హాస్పిటల్ ఏర్పాటు విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత 50ఏళ్ల నుంచి వడ్డెర బస్తి ప్రజలకు కేటాయించిన స్థలాన్ని ఇపుడు తమది అంటూ ఓయూ వైస్ ఛాన్సలర్ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఓయూ అధికారులు స్థలం కేటాయించాలని తెలిపారు.

Tags:    

Similar News