స్వచ్ఛ తెలంగాణ నువ్వెక్కడ..?
స్వచ్ఛ తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
దిశ, చైతన్య పురి : స్వచ్ఛ తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొత్త పేట డివిజన్ లో మోహన్నగర్ బస్టాప్ వద్ద, విక్టోరియా మెమోరియల్ స్కూల్ మెట్రో స్టేషన్ వద్ద, కొత్తపేట రైతుబజారు ముందు, ఎన్టీఆర్ నగర్ అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ ముందు స్వచ్ఛ భారత్ బయో మూత్రశాలలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం మూలంగా శిథిలమయ్యాయి.
పరిస్థితి ఏమిటి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ తెలంగాణ బయో మూత్రశాలలు నేడు వాడడం లేదు. శిథిలావస్థకు చేరి వాహనదారులకు, ప్రజలకు అందని ప్రాయంగా మారాయి. అధికారుల తీరు పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మూత్రశాలలు నిరూపయోగంగా మారాయి. తద్వారా ఎక్కడ పడితే అక్కడ బాటశారులు మూత్ర విసర్జన చేస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతుంది. వీటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.