బెంగాల్ టైగర్ మృత్యువాత...

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందడంతో వన్యప్రాణి ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు.

Update: 2023-04-05 15:35 GMT

దిశ, బహదూర్ పురా : హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందడంతో వన్యప్రాణి ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జూ అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా మగ రాయల్ బెంగాల్ టైగర్ (10) అజీర్తి, ఆకలి లేమితో బాధపడుతుంది. అజీర్తి, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా టైగర్ ఆరోగ్యం క్షీణించింది.

నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు తెల్లవారుజామున బెంగాల్ టైగర్ మరణించింది. మూత్రపిండం వైఫల్యం కారణంగా బెంగాల్ టైగర్ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News