మిసెస్​అందాల పోటీల్లో రాణించిన సుధాదేవి

Update: 2022-01-24 17:05 GMT

దిశ, సికింద్రాబాద్: మిసెస్ చీర్ ఫుల్-2021 అవార్డును హైదరాబాద్‌కు చెందిన సుధాదేవి గెలుచుకున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి తెలుగు రాష్ర్టాల స్థాయి మిసెస్-2021 అందాల పోటీలను వర్చువల్ మోడ్‌లో నిర్వహించినట్లు ఆర్గనైజర్ మమతా త్రివేది తెలిపారు. పోటీల్లో మొత్తం 37 మంది పాల్గొన్నారు. సింగపూర్, ముంబై, బెంగళూర్, చెన్నై నుంచి వచ్చిన వారు ఈ ఈవెంట్కు ప్యానెల్ జడ్జీలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో సుధాదేవి రన్నరప్‌గా నిలవగా, ఆమె కు మిసెస్ చీర్ ఫుల్ - 2021 అవార్డును ఆమెకు అందజేశారు.

పేద విద్యార్థులకు సాయం

అర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనర్ కోర్సులకు ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే కలర్స్ అకాడమీలో మేనేజింగ్ పార్టనర్‌గా సుధాదేవి నాయుడు వ్యవహరిస్తున్నారు. కోచింగ్ కోసం తమ అకాడమీకి వచ్చే వైట్ రేషన్ కార్డు కలిగిన పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా వారి ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈసీఐఎల్, హిమాయత్నగర్, కూకట్పెల్లి లో బ్రాంచీలు కలిగిన తమ కలర్స్ అకాడమీలో ఇప్పటి వరకు వందల మంది పేద విద్యార్థులకు సహాయం అందించినట్లు ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News