Bandi Sanjay నిజమైన హిందువు కాదు: పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్
డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి సంజయ్చేసిన ఆరోపణలపై 24గంటలలో తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేసి రుజువు చేయాలని డిమాండ్‌చేసిన ఎమ్మెల్యే పైలట్రోహిత్ రెడ్డి.. ఆదివారం మరోమారు చార్మినార్‌భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు.
దిశ, చార్మినార్: డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై 24గంటలలో తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేసి రుజువు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. ఆదివారం మరోమారు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నఅనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌లపై తీవ్ర విమర్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారని, నేను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద చేసిన సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదన్నారు. బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే గాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు.
బండి సంజయ్ చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకి అర్థమయ్యిందన్నారు. బండి సంజయ్‌కు రఘునందన్ అనే సుద్ద పూస ఒకాళ్త పుచ్చుకున్నాడన్నారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశ్రమల యజమానులను బెదిరించనిదే.. వందల కోట్లు ఎలా సంపదించారని ప్రశ్నించారు. రఘునందన్ పఠాన్ చెరులో పరిశ్రమల నుంచి వసూళ్లు చేశారా ? లేదా చెప్పాలన్నారు. అలాగే డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కర్ణాటక పోలీసులు నన్నెప్పుడూ విచారణకు పిలవలేదన్నారు. ఆ కేసు ఎఫ్ఐఆర్‌లో కూడా నా పేరు లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ ఇక్కడికి రాకపోవటంతో నిజమైన హిందువు కాదని అర్థం అయ్యిందన్నారు.
READ MORE