ఇష్టారాజ్యంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ..

ఇష్టారాజ్యంగా ఫుట్ పాత్ల ఆక్రమణ రాష్ట్రంలోని ప్రజలందరికీ

Update: 2024-08-05 15:02 GMT

దిశ, ఖైరతాబాద్ : ఇష్టారాజ్యంగా ఫుట్ పాత్ల ఆక్రమణ రాష్ట్రంలోని ప్రజలందరికీ హైదరాబాద్ అమీర్పేట్ అంటే అందరికీ సుపరిచితమే నగరంలో నడిబొడ్డున అన్నదే అమీర్పేట్ రహదారి వైపుగా వెళ్తుంటారు. అక్కడి పరిసర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అలాంటి చోట కోచింగ్ సెంటర్లు , హోటల్లు , ఆఫీస్లు , సినిమా థియేటర్లు నిత్యం ప్రజలు సంచరిస్తూ ఉంటారు. అలాంటి రద్దీ ప్రదేశాన్ని కొందరు అదునుగా చేసుకొని పాద చర్యలు ఏర్పాటు చేసిన ఫుట్ పాట్లను చోటామోటా లీడర్లు ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తు వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెళ్లిపోతుంది.

ఇబ్బందులకు గురవుతున్న పాద చారులు..

పాదాచారులు కొరకు ఫుట్పాత్ లను ఏర్పాటు చేస్తే వాటిని కాస్త కొందరు వ్యక్తులు మేము పుట్టి పెరిగింది ఇక్కడే బస్తివల్లం అంటూ ముందుగానే వారి వద్ద ఉన్న నాలుగు చక్రాల తోపుడు బండి తీసుకొచ్చి ఫుట్ పాత్ పై ఖాళీ స్థలంలో పెట్టి ఆక్రమించుకుంటారు. అక్కడ ఎవరు ఎలాంటి వ్యాపారం నిర్వహించాలన్న ముందుగా వారిని సంప్రదించాలి లేదంటే బెదిరింపులకు గురిచేస్తారు. వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాన్ని తినుబండారాలు మొదలుకొని టీ కొట్టు , లాంటి వ్యాపారుల వద్ద నుండి సుమారు రోజుకు 200 రూపాయల నుండి 1 వెయ్యి రూపాయల వరకు అద్దెకిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులను ఎవరూ రాకుండా మేము చూసుకుంటామని చెబుతారు. అయితే వీరికి అధికారులకు మధ్య సమన్వయం కలిసి రావడంతో వారి వ్యాపారాలు మూడు పువ్వులు , ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ , వ్యాపారాలు..

ఎస్సార్ నగర్ నుండి అమీర్పేట్ , సత్యం థియేటర్ నుండి మైత్రివనం వైపు పాదచారా కొరకు ఏర్పాటు చేసిన ఫుట్పాతులు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇష్టారాజ్యంగా రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం , ఫుట్ పాత్ లపై కోచింగ్ సెంటర్లకు సంబంధించిన బోర్డ్ లు పెట్టడం వల్ల రోడ్లపై వెళ్లే వాహనాలు నిలిచిపోయి , ట్రాఫిక్ సమస్యగా మారుతోంది దీంతో అటుగా వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న వారిపై అధికారుల చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయి.


Similar News