భవిష్యత్ ఓపెన్ వర్సిటీలదే: అంబేద్కర్ వర్సిటీ జేఏసీ నేతలు

భవిష్యత్ అంతా ఓపెన్ వర్సిటీలదేనని అంబేద్కర్ వర్సిటీ జేఏసీ నాయకులు తెలిపారు....

Update: 2024-11-11 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్ అంతా ఓపెన్ వర్సిటీలదేనని అంబేద్కర్ వర్సిటీ జేఏసీ నాయకులు తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి(జేఎన్ఏఎఫ్ఏయూ) అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వర్సిటీ జేఏసీ సోమవారం సైతం నిరసనలు కొనసాగించింది.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి మేధావుల మాటంటే కూడా లెక్కలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన పలువురు మేధావులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూములను ఎవరికీ ఇకేటాయించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినా పరిగణలోకి తీసుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రానున్నరోజుల్లో సర్కార్ పై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో జేఏసీ చైర్ పర్సన్ పల్లవీ కాబ్డే, జనరల్ సెక్రటరీ డాక్టర్ పీ వేణుగోపాల్ రెడ్డి, జేఏసీ నాయకులు పుష్పా చక్రపాణి, ఎండీ హబీబుద్దీన్, ప్రమీల కేతావత్, కాంతం ప్రేమ్ కుమార్, రజనీకాంత్, రాములు, షబ్బీర్, జహంగీర్, అవినాష్, కిషోర్, రాఘవేందర్ తదితరులు ఉన్నారు.


Similar News