దివి నుంచి భూవికి దిగొచ్చిన చిన్నారి దేవతలు..

హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా పాఠశాలల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. స్కూళ్లన్నీ దేవతామూర్తులతో నిండిపోయాయి.

Update: 2024-07-27 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా పాఠశాలల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. స్కూళ్లన్నీ దేవతామూర్తులతో నిండిపోయాయి. ఆదివారం నగర వ్యాప్తంగా బోనాల పండుగ జరిపేందుకు ఆలయాలు అన్నీ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూళ్లలో బోనాల సంస్కృతి ఉట్టిపడేలా విద్యార్థినీ, విద్యార్థులు దేవతామూర్తులు, పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారి విద్యార్థినీలు నవదుర్గా మాతల అవతారాల్లో మెరిసిపోయారు. గ్రామ దేవతలే దిగొచ్చారా అన్నరీతిలో మైమరిపించారు. విద్యార్థులు పోతురాజుల విన్యాసాలతో అలరించారు. దివి నుంచి భూవికి దిగొచ్చిన విద్యార్థినీ దేవతల ఫొటోలను ఈ చిత్రమాలికల్లో చూడవచ్చు. 

 



 



Similar News