తెలుగు వర్సిటీలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులకు ప్రవేశాలు

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని కింది పేర్కొన్నసెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులో 10 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయని యూనివర్సిటీ డైరెక్టర్ డా.బి. రాధా ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2024-11-21 11:58 GMT

దిశ, రవీంద్రభారతి : 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని కింది పేర్కొన్నసెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులో 10 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయని యూనివర్సిటీ డైరెక్టర్ డా.బి. రాధా ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు (శుక్రవారం) ఉదయం 11.00 నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలోని సంబంధిత శాఖల్లో విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 సెట్ల జిరాక్స్ ప్రతులతో సంప్రదించగలని పేర్కొన్నారు. ఈ సీట్లలో ప్రవేశం పొందిన వారికి హాస్టల్ సౌకర్యం ఉండదని తెలిపారు. ఫీజు వివరాలు ఇలా..ఎం.ఏ. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు: రూ.22,000, ఎం.ఏ. తెలుగు (బాచుపల్లి ప్రాంగణం) సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు: రూ. 15,000, ఎం.ఏ. హిస్టరీ కల్చర్ అండ్ టూరిజం: సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు: రూ. 22,000, లు చెల్లించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఎం.ఏ.జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులో ప్రవేశాలకు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించబడతుందని తెలిపారు. ఎన్సీసీ, పీహెచ్సీ స్పోర్ట్స్ కోటాలో ప్రవేశం పొందడానికి సంబంధిత సర్టిఫికెట్లతో ఆయా శాఖల్లో సంప్రదించగలరని పేర్కొన్నారు.


Similar News