వ్యభిచార గృహంపై పోలీసులు దాడి…

గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేసి ఒక విటుని , వ్యభిచారం చేస్తున్న మహిళను , ఒక నిర్వహుకురాలిని అరెస్టు చేశారు.

Update: 2024-11-07 15:53 GMT

దిశ, జూబ్లీహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న  గృహంపై పోలీసులు దాడి చేసి ఒక విటుని , వ్యభిచారం చేస్తున్న మహిళను , ఒక నిర్వహుకురాలిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన వ్యభిచార గృహం నిర్వహించే నందిని (నందు) అనే మహిళ వెంకటగిరి, కృష్ణ నగర్ ప్రాంతాల నుండి మహిళలకు వల వేసి విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహించేది. ఈ నేపథ్యంలో నందిని (నందు) వద్ద నుండి రామస్వామి కావ్య అనే మరొక నిర్వాహకురాలు వెంకటగిరి ప్రాంతంలో బుధవారం వ్యభిచారం నిర్వహిస్తుందని సమాచారం రావటంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యభిచారం చేస్తున్న ఒక మహిళ (29) , ఒక విటునీ (40) , సబ్ నిర్వాహకురాలు రామస్వామి కావ్యని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరి వద్దనుండి 3 సెల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News