మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్...
ఓ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకోగా సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
దిశ, కార్వాన్: ఓ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకోగా సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, ఆళ్లగడప గ్రామానికి చెందిన వెంకన్న కొడుకు వంశీ (26) ఫోటోగ్రాఫర్. సూర్యాపేటకు చెందిన ఓ మైనర్ బాలిక కోటి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చేస్తుంది. బాలిక ఆళ్లగడ్డ లోని తన చుట్టాల ఇంటికి వెళ్లగా వంశీ అక్కడ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా వీరిరువురి మధ్య ప్రేమాయణం నడిచింది. కాగా ఈ నెల 2వ తారీఖున బల్కంపేట లోని ఎల్లమ్మ దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితున్ని శుక్రవారం చాదర్ఘాట్ ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.