హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల బిర్యానీలో కప్ప ప్రత్యక్షం

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇష్టంగా ఫుడ్ తిందామని మెస్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కళ్లముందు వేడివేడిగా బిర్యానీ రాగానే తినడం మొదలు పెట్టారు.

Update: 2024-10-20 09:19 GMT

దిశ, శేరిలింగంపల్లి ; హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇష్టంగా ఫుడ్ తిందామని మెస్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కళ్లముందు వేడివేడిగా బిర్యానీ రాగానే తినడం మొదలు పెట్టారు. చికెన్ ముక్క తిందామని అన్నంలో వేలు పెట్టగానే వారికి అనుకోని ముక్క చేతికి తగిలింది. అదేంటి విచిత్రంగా ఉందని చూడగా.. అది చికెన్ ముక్క కాదు అచ్చమైన కప్పగా తేలింది. చికెన్ బిర్యానీలో రోస్ట్ అయిన కప్ప కనబడడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఎక్కడో హోటల్ లో చోటుచేసుకుంది కాదు.. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఉన్న కదంబ మెస్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఐఐఐటి లోని కదంబ మెస్స్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో రోస్ట్ అయిన కప్ప వచ్చిందని, దీనిపై మెస్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. బిర్యానీలో కప్ప వచ్చిన ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేసిన విద్యార్థులు మెస్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News