ఆరు నెలల్లోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నగరంలో డొమెస్టిక్ & గ్లోబల్ ఆఫీస్ లీజింగ్ స్పేస్ రెండింటిలోనూ డిమాండ్ 40 శాతం పెరిగింది, వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రభుత్వం నిశ్శబ్దంగా, సమర్థవంతమైన పని చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. తాము రాబోయే కోన్నేళ్లలో హైదరాబాద్‌ను పునర్నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి అవకాశాలు సృష్టిస్తామని సీఎం ట్వీట్ చేశారు.
కాగా, హైదరాబాద్ నగరంలో ఆఫీసులకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆరు నెలల్లో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం లీజింగ్‌కు వెళ్లిందని, గతేడాది ఇదే సమయంలో 36 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే అద్దెకు వెళ్లిందని, దీంతో ఈసారి ట్రాన్సాక్షన్లలో 40 శాతం మేర వృద్ధి పెరిగినట్లు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ రిపోర్ట్ పేర్కొంది.