హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ అటువైపు వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కినట్లే!

నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 15న ఉదయం హైదరాబాద్‎కు రానున్న మోడీ.. మల్కాజ్‎గిరిలో నిర్వహించే విజయ సంకల్ప సభ రోడ్ షోలో పాల్గొననున్నారు.

Update: 2024-03-15 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 15న ఉదయం హైదరాబాద్‎కు రానున్న మోడీ.. మల్కాజ్‎గిరిలో నిర్వహించే విజయ సంకల్ప సభ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో బేగంపేట నుండి మల్కాజ్‎గిరి రూట్ మొత్తం భారీ బధ్రత ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. రోడ్ షో వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు.


ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. బందోబస్తులో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు ఉండనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను తెలంగాణ బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12కు పైగా సీట్లు రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో మోడీ పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News