Hyderabad Metro Rail: ఎల్ అండ్ టీ సంస్థ సంచలన నిర్ణయం..! అమ్మకానికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్
ప్రపంచ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును విక్రయించేందుకు సన్నద్ధమతున్నట్లుగా తెలుస్తోంది. 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో చాలా తక్కువ కాలంలోనే నగరంలో ప్రయాణికుల మన్ననలు అందుకుంది. హయ్యెస్ట్ అక్యూపెన్సీతో అధిక లాభాలను గడిస్తూ.. విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే నిర్వహణ సంస్థకు ఎల్ అండ్ టీ (L&T)కి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించడంతో మెట్రో రైల్‌కు ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లేడీస్ కంపార్ట్‌మెంట్లు నిత్యం వెలవెలబోతున్నాయి. దీంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు 2026 తరువాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను అమ్మేసేందుకు ఎల్ అండ్ టీ ప్లాన్ చేస్తోంది. మహాలక్ష్మి పథకం కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో L&T వాటా వాటా 90 శాతం కాగా, ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మెట్రో మెయింటెనెన్స్ 65 ఏళ్లకు ఉండటంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు సంస్థ భావిస్తోందని శంకర్ రామన్ స్పష్టం చేశారు.
L&T to exit Hyderabad Metro project, director blames free bus rides for fall in Metro ridership https://t.co/XfRtn2p2jC
— Shiv Aroor (@ShivAroor) May 12, 2024