HYD : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

విదేశీ కరెన్సీ తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Update: 2023-03-07 07:11 GMT

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ నుంచి విదేశాలకు అక్రమంగా విదేశీ కరెన్సీ తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం హైదరాబాద్ నుండి (EK-527) ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన ప్రయాణికుడు, విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికునిపై అనుమానం వచ్చి పూర్తిస్థాయిలో స్కానింగ్ చేయగా ప్రయాణికుని వద్ద విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా లో దుస్తులలో విదేశీ కరెన్సీ దాచి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వద్ద రూ.11 లక్షల విలువ జేసే దుబాయ్ దిరమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News