HYD : జూబ్లీహిల్స్‌లో యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.

Update: 2023-04-14 03:14 GMT
HYD : జూబ్లీహిల్స్‌లో యువతిపై అత్యాచారయత్నం
  • whatsapp icon

దిశ, జూబ్లీహిల్స్ : యువతిపై అత్యాచారం ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కలకలం రేపింది. సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ, మాజీ ప్రేమికుడు లలిత్ ఓ కొంత కాలం క్రితం ప్రేమించుకుని విడిపోయారు. కాగా లలిత్ ఓ పబ్‌లో గిటారిస్ట్‌గా పనిచేస్తున్నాడు. లలిత్ స్నేహితుడితో బాధిత మహిళ ప్రేమాయణం సాగించగా ఇటీవల లలిత్ బాధిత మహిళ ఒక కార్యక్రమంలో కలిశారు. మళ్ళీ మాటలు కలుస్తుండగా లలిత్ స్నేహితుడితో, బాధిత మహిళ ప్రేమాయణం లలిత్‌కి తెలిసింది.

ఈ క్రమంలో కాజగూడలోని నివాసంలో లలిత్‌కు బాధిత మహిళ‌తో ఈనెల 11న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా మహిళపై లలిత్ శారీరకంగా దాడి చేశాడు. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ బాయ్ ఫ్రెండ్‌ని చంపుతానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా బాధిత మహిళ యొక్క ప్రైవేట్ ఫోటోను లీక్ చేస్తానని లలిత్ బెదిరించడంతో బాధిత మహిళ ఏప్రిల్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News