HYD : హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 5 హత్యలు

హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 5 హత్యలు, 2 హత్యా యత్నాలు జరగడం తీవ్ర కలకలం రేపింది.

Update: 2024-06-20 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 5 హత్యలు, 2 హత్యా యత్నాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. పాతబస్తీ శాలిబండలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. తుకారాం‌గేట్‌లోని అడ్డగుట్టలో భార్య రోజాను భర్త హత్య చేశాడు. మల్లపల్లి అసీఫ్‌నగర్ లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యక గురయ్యాడు. కాచిగూడలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగలు హత్య చేశారు. సనత్‌నగర్‌లోని భరత్‌నగర్‌లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శాలిబండలో వజీద్, ఫకృద్దీన్‌లపై హత్యాయత్నం జరిగింది.  


Similar News