ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. బస్ పాస్ ధరలు భారీగా పెంపు

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ఛార్జీల భారం

Update: 2022-03-28 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ఛార్జీల భారం మోపుతోంది. ఇప్పటికే బస్సు ఛార్జీల ధరలను పెంచగా.. తాజాగా బస్ పాస్ ల ధరలను కూడా పెంచింది. ఆర్డినరీ పాస్ ధర రూ.970 నుంచి రూ.1150కి పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధర రూ.1070 నుంచి రూ.1300కు, మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1185 నుంచి రూ.1450కి పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పాస్ ధర రూ.1100 నుంచిరూ.1350కి పెంచింది. పుష్పక్ ఏసీ పాస్ ధర రూ.2500 నుంచి రూ.3 వేలకు పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News