విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ (ఆనర్స్) సీట్ల పెంపు
2024-25 విద్యా సంవత్సరానికి గాను జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ (ఆనర్స్) సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 విద్యా సంవత్సరానికి గాను జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ (ఆనర్స్) సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సీట్లను పెంచినట్లుగా వర్సిటీ అధికారులు వెల్లడించారు. అదనంగా పెంచిన 200 సీట్లను కూడా రెగ్యులర్ విధానంలో కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నట్లుగా వారు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక కోటాలో ఉన్న బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు ఫీజును భారీగా తగ్గించారు. ప్రస్తుతం బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ఫీజు రూ.10 లక్షలు ఉండగా.. ఆ రుసుమును రూ.5 లక్షలకు తగ్గించారు.