టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు.. 5 నిమిషాల్లోనే రాజీనామా ఎలా ఆమోదిస్తారు? : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒప్పందం లేకుండానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల వ్యవధిలో ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదంతో ఈ విషయం మరోసారి స్పష్టమైందని చెప్పారు. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని.. హుజురాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ కు అవసరమైతే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి అవసరం అని అన్నారు. ఒకరి అవసరాల కోసం మరొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య కుమ్మక్కు రాజకీయం నడుస్తోందని విమర్శించారు. మరో వైపు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కసరత్తుచేస్తోంది. ఇవాళ గాంధీ భవన్‌లో ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగుర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Munugode Bypoll: బిగ్ బ్రేకింగ్ : మునుగోడులో హస్తం టికెట్ అతడికే..!