KTR : ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ? : కేటీఆర్

మానుకోటలో ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవని..మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కాంగ్రెస్ (Congress government) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2024-11-21 10:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : మానుకోటలో ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవని..మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కాంగ్రెస్ (Congress government) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మానుకోటల సాయుధ పోలీసుల లాంగ్ మార్చ్ వీడియోలను ఎక్స్ లో పోస్టు చేసిన కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్కడ గొడవలు ఏం జరగలేదని మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకని, అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుందంటూ నిలదీశారు. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని, ఇది ప్రజాపాలన ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.

ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన..మొత్తంగా రాక్షస పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఇది తెలంగాణ..ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందంటూ హెచ్చరించారు. 

Tags:    

Similar News