ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎలా రేవంత్..? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎలా రేవంత్ రెడ్డి (Revanth Reddy), అలా చేయమని ఏ చట్టం చెబుతుంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader Rs Praveen Kumar) అన్నారు.

Update: 2025-03-15 14:01 GMT
ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎలా రేవంత్..? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎలా రేవంత్ రెడ్డి (Revanth Reddy), అలా చేయమని ఏ చట్టం చెబుతుంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader Rs Praveen Kumar) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జరుగుతున్నారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జర్నలిస్టుల పేరుతో ప్రజలను ప్రలోభ పెట్టి బూతులు మాట్లాడిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్ఎస్పీ (RSP).. సంచలన వ్యాఖ్యలు (Sansational Comments) చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది రేవంత్ రెడ్డి, గుడిలో దేవుడు వరాలిస్తే.. అసెంబ్లీ రాజ్యాంగబద్దంగా రక్షణ, హక్కులు, అధికారాలు, అవకాశాలు ఇస్తుందని తెలిపారు. మీరు ఒక వైపు చట్టప్రకారం శిక్షిస్తామని చెబుతూనే.. మరోవైపు బట్టలూడదీసి కొడుతామంటున్నారని, ఇలాంటి శిక్షలు వెయ్యమని ఏ చట్టం చెబుతుంది..? ఏ సెక్షన్ అనుమతిస్తుంది..? హోం మంత్రి (Home Minister) గా మీరే చెప్పాలని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అలాగే ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎట్లా..? అని మండిపడ్డారు.

నిజానికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేవరకు బూతులు మాట్లాడేది ఎవరు అంటూ.. రాష్ట్ర ప్రజలకు, జర్నలిస్టులకు, మీ ఎమ్మెల్యేలకు బూతులు నేర్పుతున్నది ఎవరు అని నిలదీశారు. అంతేగాక నాకు కూడా చీము నెత్తురు ఉన్నది అని మీరు అన్నారని, నిజంగా అదే నిజమైతే ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి అని దుయ్యబట్టారు. ఇక రైతు బంధు (Raithu Bandhu) 15వేలు,, మహిళలకు రూ. 2500.. వృద్ధులకు రూ. 4000 ఫించన్.. విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, కామారెడ్డి (Kamareddy), చేవెళ్ల (Chevella), వరంగల్ (Warangal), సరూర్ నగర్ డిక్లరేషన్లను (Sarror Nagar Decleration) అమలు చేయండి అని బీఆర్ఎస్ లీడర్ రాసుకొచ్చారు.

READ MORE ...

ఆ రెండు పార్టీల బంధంపై సీఎం ఓపెన్ స్టేట్‌మెంట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Full View

Tags:    

Similar News