Telangana Election 2023: తెలంగాణలో మొదలైన హోమ్ ఓటింగ్.. మొదటి ఓటు వేసిన 91 ఏళ్ల వృద్ధురాలు
ఓటు హక్కును ప్రతి యొక్కరు వినియోగించుకోవాలి
దిశ,వెబ్ డెస్క్ : ఓటు హక్కును ప్రతి యొక్కరు వినియోగించుకోవాలి. అలాగే ఓటు హక్కు విలువను అందరూ తెలుసుకోవాలి. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.దీనిలో భాగంగానే హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఓటు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నవంబర్ 21 న ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 91 ఏళ్ల అన్నపూర్ణ చుండూరి ఆమె ఇంటి వద్దే ఓటు వేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా మొదటి ఓటరు అయ్యారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ఆమె నివాసానికి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకెళ్లారు. ఈ ఓటింగ్ సదుపాయం నవంబర్ 27 వరకు అందుబాటులో ఉండనుందని అధికారులు తెలిపారు. దీనికి 80 ఏళ్లు పైబడిన వృద్దులు, దివ్యాంగులు ఈ ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.