ఆర్టీసీ బస్సుకు హిజ్రాల పూజలు.. ఎందుకో తెలుసా?

ఆర్టీసీ బస్సుకు హిజ్రాలు పూజలు చేశారు.

Update: 2022-11-24 09:04 GMT

దిశ, అచ్చంపేట : ఆర్టీసీ బస్సుకు హిజ్రాలు పూజలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపోకు ఒక ప్రైవేటు నూతన బస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట మండల పరిధిలోని బుల్గేట్పల్లి గేటు వద్ద యాచిస్తున్న హిజ్రాలను పిలిపించి యజమాని పూజలు చేయించారు. పూజలు చేసిన హిజ్రాలు బస్సు యజమానిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పూజలు చేసిన హిజ్రాలు జయమ్మ, యమున, తనూజాలు మాట్లాడుతూ.. తమను చిన్న చూపు చూడవద్దన్నారు. కొంతమంది తమతో ఇలాంటి పూజలు చేయించుకుని ఆశ్వీర్వాదం తీసుకుంటారన్నారు. కాగా హిజ్రాల ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందనే విశ్వాసం నెలకొంది. 

Tags:    

Similar News