డీలిమిటేషన్‌తో హై టెన్షన్.. కేంద్రం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
డీలిమిటేషన్ అంశంలో కేంద్రం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ అంశంలో కేంద్రం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్ సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా డీ లిమిటేషన్ తర్వాత వాటి సంఖ్య 848 కి పెరగనుంది. డీలిమిటేషన్ తో ఉత్తరాదిలో సీట్లు పెరగనుండగా దక్షిణాదిలో భారీగా తగ్గనున్నాయి. దీంతో సౌత్ వాయిస్ తగ్గనుందనే వాదన వినిపిస్తోంది. డీలిమిటేషన్ తో డేంజర్ బెల్స్ తప్పవని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం లోక్ సభ స్థానాలు 848కి పెరిగే ఛాన్స్ ఉంది.
అయితే దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తే ఈ ప్రక్రియ ఆగిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. 2013 తర్వాతే డీ లిమిటేషన్ అమలు అవుతుందని మేధావులు అంటున్నారు. ఉత్తరాది పెత్తనం దక్షిణాదిపై పెరుగుతుందని పలు పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. డీ లిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర కోణం ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందో అనేది ఆసక్తిగా మారింది.