కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభస

కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ 23వ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన కొనసాగుతోంది.

Update: 2024-07-02 08:47 GMT

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ 23వ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన కొనసాగుతోంది. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. జమ్మికుంటకు చెందిన జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ తన టీ షార్ట్ పైన నినాదాలు రాయించుకుని సమావేశానికి హాజరు కాగా పోలీసులు సమావేశ మందిరంలోకి అనుమతించలేదు.

మరోవైపు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల గురించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేక హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సర్వసభ్య సమావేశం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. డీఈవోను సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమావేశ మందిరంలో బైఠాయించి నిరసన తెలిపారు.


Similar News