తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కారణమిదే..!

తెలంగాణ సీఎస్, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2024-07-17 17:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎస్, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం, మినిస్టర్స్‌కు చెల్లిస్తున్న వేతనాలకు సంబంధించి ట్యాక్స్‌ను ప్రభుత్వం చెల్లించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి ప్రతివాదులుగా ఉన్న సీఎస్, జీఏడీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరే సీఎం, మంత్రులు పన్ను చెల్లించాల్సి ఉందని.. అయితే గవర్నమెంట్ చెల్లించడం ఏంటని సుపరిపాలనా వేదిక కార్యదర్శి శ్రీనివాస రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే సీఎస్, జీఏడీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.


Similar News