పిటిషనర్ కు హైకోర్టు భారి జరిమానా.. సంచలనంగా మారిన తీర్పు
రాష్ట్ర హైకోర్టు జస్టిస్ భీంపాక నగేశ్ వెలువరించిన తీర్పు సంచలనంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టు జస్టిస్ భీంపాక నగేశ్ వెలువరించిన తీర్పు సంచలనంగా మారింది. పిటిషనర్ కు భారిగా జరిమానా విధించిచడంతో న్యాయ నిపుణలలో చర్చ కోనసాగుతుంది. ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా అడ్డుకున్న హైకోర్టు ధర్మాసానాన్ని తప్పుదోవ పట్టించినందుకు రూ.కోటి జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్ ఆదేశించారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ వెంకట్రామిరెడ్డి మరో బెంచ్ వద్ద కొత్త పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకున్నాడు. ఈ విషయం ధర్మాసనం దృష్టికి రావడంతో జస్టిస్ నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ వెంటకట్రామి రెడ్డికి బండ్లగూడ మండలం కందికల్లో సర్వే నెంబర్ 310/1, 310/2లలో 9.11 ఎకరాల భూమి ఉందని పిటిషన్ లో పేర్కోన్నారు.
పిటిషనర్ కు చెందిన భూమిని అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని న్యాయవాది కందగట్ల ధీరజ్ పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. పిటిషనర్ తన భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్లు కందికల్ గ్రామంలో లేవని కోర్టుకు వివరించారు. కందికల్ గ్రామంలో 309/5తోనే సర్వేనెంబర్ ముగుస్తుందని కోర్టుకు వివరించారు. నకిలీ పత్రాలతో పిటిషినర్ ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని వివరించారు. ఈ భూమిపై గతంలోనే పిటిషనర్ తండ్రి హైకోర్టులో రెండు పిటిషన్లు వేర్వేరుగా వేశారని తెలిపారు. ఈ పిటిషన్లను ఆయన విరమించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది జస్టీస్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ పిటిషన్ల గురించి పిటిషనర్ తన అఫిడవిట్లో ఎక్కడా ప్రస్తావించకుండా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. వాదనలు పరిశీలించిన అనతంరం జస్టీస్ నగేశ్ సంచలన తీర్పు వెలువరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా , కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్ వేసేందుకు పిటిషన్ దారులు ఆలోచించుకునేలా రూ. కోటి జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక ఉంటుదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను దాచి కోర్టును తప్పదోవ పట్టించారనే కేసులో 2024 ఏప్రిల్ లో ఆదిబట్ల మాజీ చైర్పర్సన్ కె.ఆర్తికకు హైకోర్టు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. విధించిన జరిమానాను నాలుగు వారాల్లోగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జరిమానా ఎన్ని రోజులలో చెల్లించాలన్న గడువు పై ఇంకా ఏ వివరాలు వెలువడలేదు.