బిగ్ బ్రేకింగ్ : బండి సంజయ్ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భైంసాలో నిర్వహించనున్న పాదయాత్ర, బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిశ ప్రతినిధి, కరీంనగర్ : బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భైంసాలో నిర్వహించనున్న పాదయాత్ర, బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన అనంతరం సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. అత్యంత సున్నితమైన పట్టణంగా భైంసా ఉందని, బీజేపీ పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. దీంతో భైంసాకు బయలు దేరి వెళ్లిన బండి సంజయ్‌ని జగిత్యాల జిల్లా వెంకటాపూర్‌లో అదుపులో తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఆయన ఇంటివద్ద వదిలి వెళ్లారు. సోమవారం లీగల్ టీం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అయితే తాము భైంసా పట్టణంతో సంబంధం లేకుండా పాదయాత్ర బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామని బీజేపీ న్యాయ వాదులు హైకోర్టుకు నివేదించారు. భైంసా సమీపంలోని వై జంక్షన్ వద్ద బహిరంగ సభ, పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భైంసా పట్టణంలో కార్యక్రమాలు జరగనప్పుడు మీకేందుకు అభ్యంతరమంటూ పోలీసులను హై కోర్టు ప్రశ్నించింది. కొద్ది సేపట్లో భైంసాకు బండి సంజయ్ బయల్దేరి వెళ్లనున్నారు.
Read more: