వరద బాధితులకు చేయూత నివ్వాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమాలకు తోడుగా ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు ముందుకు వచ్చి వరద బాధితులకు చేయూత నివ్వాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

Update: 2024-09-08 14:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమాలకు తోడుగా ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు ముందుకు వచ్చి వరద బాధితులకు చేయూత నివ్వాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం (హైసియా) ఖమ్మం మున్నేరు వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. 3 కోట్ల విలువైన 10వేల కిట్లను ప్రభుత్వానికి అందజేసింది. అదే విధంగా నిర్మాణ డాట్ ఆర్గ్ సంస్థలు సైతం ముందుకు వచ్చి నిత్యావసర వస్తుల సామగ్రిని అందజేశారు. అందుకు సంబంధించిన వాహనాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి ఆదివారం సచివాలయంలో ప్రారంఢించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఒక్కొ కిట్ లో 3వేల విలువైన నిత్యావసరాలు ఉన్నాయన్నారు. తుమ్మల మాట్లాడుతూ వాహనాలు ఖమ్మం కు చేరిన వెంటనే ఈ కిట్లను వరద భాదితులకు అందేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెండ్ల, మాజీ అధ్యక్షుడు భరణీ కుమార్, మనమాస రాంమ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.


Similar News