Traffic Update: గచ్చిబౌలి రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్!

నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌తో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ తీవ్రత.. రోడ్డుపై నిమిషాల తరబడి సిగ్నల్స్ వద్ద వేచి చూస్తూ వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

Update: 2024-05-28 06:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌తో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ తీవ్రత.. రోడ్డుపై నిమిషాల తరబడి సిగ్నల్స్ వద్ద వేచి చూస్తూ వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ అప్డేట్ ఇచ్చారు. ఉడీపీ యూటర్న్ వద్ద బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి వైపు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ కదలిక నెమ్మదిగా ఉందని వెల్లడించారు.

గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10: 35 గంటలకు ఉన్న ట్రాఫిక్‌లో వాహనాలు నిలిచి ఉన్న ఫోటోను నెట్టింట పోస్ట్ చేశారు. కాగా, అప్డేట్స్ ఇస్తున్నందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News