Heavy Rains: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

Update: 2024-09-06 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ అధికారులు ఆ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  


Similar News