కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. అత్యవసరమైతే ఈ నెంబర్లకు కాల్ చేయాలని GHMC హెచ్చరిక!

కాసేపట్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవనుందని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

Update: 2024-06-07 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవనుందని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. కాగా అత్యవసరమైతే 040-21111111 5 90001136675 కు ఫోన్ చేయాలని సూచించింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్  నగరంలోని మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోందని తెలిపింది. అంతేకాకుండా సాయంత్రం 5 గంటల తర్వాత ఈ వర్షం ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నైరుతి పవనాలు అత్యంగా వేగంగా కదులుతున్నాయని.. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రమంతా విస్తరించనున్నాయని పేర్కొంది. 


Similar News