అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం

నాలుగు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వర్షం ఈ నెల 3న కాస్త విరామం ఇచ్చింది.

Update: 2024-09-04 03:20 GMT

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వర్షం ఈ నెల 3న కాస్త విరామం ఇచ్చింది. వర్షం దగ్గిందని నగర ప్రజలు ఊపిరి పీల్చుకునే‌లోనే అర్ధరాత్రి భారీ వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జూబ్లీహిల్స్, ఈసీఐఎల్, మలక్ పేట్, మాదాపూర్ కూకట్ పల్లి, అల్వాల్, ఎల్బీనగర్ సికింద్రాబాద్, ఖైరతాబాద్, సంగారెడ్డి, కాప్రా, మేడ్చల్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అలాగే ఏపీలోను విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నెల్లురులో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 


Similar News