గంటలో బీభత్సం.. హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసిన వాన.. ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక ప్రకటన
భారీవర్షం హైదరాబాద్ నగరవాసులను బెంబేలెత్తించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: భారీవర్షం హైదరాబాద్ నగరవాసులను బెంబేలెత్తించింది. గంటపాటు కురిసిన వర్షానికి పలుచోట్ల వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది. గ్యాప్ ఇస్తూ వాన దంచికొడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. పలుచోట్ల నాలాలు కూలిపోగా, రోడ్లు కోతకు గురయ్యాయి. వరద నీరు వచ్చిచేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసులు వదిలే సమయంలోనే దంచికొట్టడంతో వాహనాల రాకపోకకు తీవ్ర అంతయారం కలిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 9లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. రోడ్ నెం. 39, సైబర్ టవర్స్ వద్ద వరద నీరు నిలిచింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద స్టీల్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, కూకట్‌పల్లి, హిమాయత్ నగర్, ఉప్పల్, అమీల్ పేట, మలక్‌పేట, జీడిమెట్ల, ఎల్బీనగర్, బహీర్ బాగ్, అబిడ్స్, కోఠితోపాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
మరో రెండు గంటల్లో భారీ వర్షం..
వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లుగానే ఇవాళ సాయంత్రం అరగంటలోనే కుంభవృష్టి కురిసింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 గంటల పాటు ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన ఉండటంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబహర్లను అందుబాటులో ఉంచింది. జీహెచ్ఎంసీ-డీఆర్ఎఫ్ సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలన్నారు.
Read More...
Two people died due to lightning: పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి..