ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులకు CS శాంతికుమారి కీలక ఆదేశాలు
రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి పలు సూచనలు చేశారు. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదరకమైన వాగులను ప్రజలు దాటకుండా చూడాలని కోరారు. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. పెద్ద వాగులో చిక్కుకున్న 40 మందిని కాపాడినందుకు భద్రాద్రి కలెక్టర్‌ను ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి అభినందించారు.