నేడు కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ

ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

Update: 2024-07-16 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే కమిషన్‌ను వ్యతిరేకిస్తూ గులాబీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. కమిషన్ సమన్లపై ఈ నెల 1 హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్‌పై సుప్రీం వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.  


Similar News