CV Anand: ‘పాపం వాళ్లకు లైఫ్ ఉంది..’ ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్ ట్వీట్ వైరల్.. సీవీ ఆనంద్ రియాక్ట్
ట్రాఫిక్ పోలీసులపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై సీవీ ఆనంద్ రియాక్ట్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతున్నది. వాహనాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) నిరంతరం ఫీల్డ్ లో ఎండనక, వాననక విధులు నిర్వర్తిస్తున్న ఉన్నారు. అయితే కొంత మంది వాహనదారుల చర్యల వల్ల ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం దెబ్బతింటోందనే విషయంల ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టీమ్ రోడ్ స్క్వాడ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ నెటిజన్ ట్రాఫిక్ పోలీసుల కష్టాలను వివరించారు. ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద విధులు నిర్వహించే పోలీసులు హియరింగ్ లాస్ తో బాధపడుతున్నారని ఓ వీడియోను పోస్టు చేశాడు. తమకు తెలియకుండానే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు మోగించే హారన్స్ రోజులో 8 గంటల వరకు వింటున్నారు. 2013లో ఓ సర్వేలో 150 మందిపైపై పరిశోధన చేస్తే 76 శాతం మంది ట్రాఫిక్ పోలీసులకు చెవుడు సమస్య ఉంది. వాహనదారులు మానవత్వంతో ఆలోచించాలి. వాళ్లు డ్యూటీ చేస్తున్నారు. వాళ్లకు లైఫ్ ఉంటుంది. ఓ గంట సేపు ట్రాఫిక్ జంక్షన్ వద్ద నిల్చుంటే పరిస్థితి ఏంటో మనకూ తెలుస్తుంది. అందవల్ల అనవసరంగా హారన్ కొట్టడం తగ్గించుకుందామని పిలుపునిచ్చారు. ఈ వీడియోపై సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) స్పందించారు. ట్రాఫిక్ పోలీస్ పడుతున్న బాధల గురించి అందరికీ తెలియచేసినందుకు టీమ్ రోడ్ స్క్వాట్ కు నా కృతజ్ఞతలు అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందింస్తున్నారు.