China: చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జన్సీ !

కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టలేక తీవ్ర ప్రాణనష్టం చవిచూడటంతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఆందోళనకు గురి చేసిన చైనా(China) దేశం మరోసారి వైరస్ ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది.

Update: 2025-01-02 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టలేక తీవ్ర ప్రాణనష్టం చవిచూడటంతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఆందోళనకు గురి చేసిన చైనా(China) దేశం మరోసారి వైరస్ ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్ (Virus attacks)ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ధ సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతుండటం....అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్‌ల మూకుమ్మడి వ్యాప్తి నేపధ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జన్సీ(Health Emergency) ప్రకటించారు. కొవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌ల చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.

వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోసారి దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన చైనా ప్రభుత్వం వైరస్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అక్కడి అధికార యంత్రాంగం వైరస్ ల నివారణ కోసమే అప్రకటిత యుద్ధమే చేస్తున్నారు. 

Tags:    

Similar News