హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అనేది ఒక జోక్ అయ్యింది?
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అనేది ఒక జోక్‌గా మారిందని పలువురు నెటజన్లు విమర్శిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అనేది ఒక జోక్‌గా మారిందని పలువురు నెటజన్లు విమర్శిస్తున్నారు. ఇటీవల క్యాడ్బరి డెరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగులు వచ్చిన ఘటన మరువక ముందే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ ప్రముఖ అవుట్ లెట్లో కొన్న బానానా కేక్ వీడియో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
నిన్న ఉప్పల్‌లోని పిస్తా హౌస్‌లో బనానా కేక్ కొన్నానని తెలిపారు. మరుసటి రోజు ఉదయం చూస్తే అది తినడానికి ఆమోదయోగ్యంగా లేదని, పైగా ఏప్రిల్ 10 వరకు దాని వ్యాలిడిటీ ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిస్తాహౌస్ యాజమాన్యం, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ స్పందించింది. జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ టీమ్‌కు సమస్య పరిష్కరించాలని సూచించింది.