ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు.. వద్దని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్

నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ప్రారంభం(caste census) కానుంది.

Update: 2024-11-06 03:02 GMT

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ప్రారంభం(caste census) కానుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కులగణన కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ (Primary School) టీచర్లకు బాధ్యత ఇచ్చారు. దీంతో ఈ కుల గణన సర్వే పూర్తయ్యే వరకు రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు పాఠాలు చెబుతారు. అనంతరం టీచర్లు ప్రభుత్వం చేపట్టనున్న కులగణన లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక్కపూట బడులు(off day schools) ప్రారంభం కానున్నాయి. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు(Former minister Harish Rao).. ఒంటిపూట బడులు వద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కులగణన నుంచి ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. టీచర్లను కులసర్వేలో ఉపయోగించడం అంటే.. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకు నడపడం సరికాదని.. ఆకస్మాత్తుగా ఒక్కపూట బడులు నడపడం వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇప్పటికే స్కూళ్లపై నమ్మకం దిగజారిపోతోందని గుర్తు చేశారు.


Similar News