Harish Rao: గురుకులాల్లోని విద్య, భోజనం వసతులపై మరోసారి స్పందించిన హరీష్ రావు(ట్వీట్)

గురుకులాల్లోని విద్య, భోజనం వసతులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి స్పందించారు.

Update: 2024-08-29 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: గురుకులాల్లోని విద్య, భోజనం వసతులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి స్పందించారు. మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి చేశాయన్నారు.

విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే, కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. గత 8 నెలల కాలంలో 500 మంది పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.

గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు ఎవరూ బాధ్యులు అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వెలుగొందిన గురుకులాలు ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.


Similar News