రాజీనామా లేఖ తీసుకొని వస్తున్నా.. హరీష్ రావు సంచలన ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2024-04-26 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రాజీనామాలకు సిద్ధమని ఇరువురు ప్రకటించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా లేఖ తీసుకొని గన్‌పార్క్‌కు బయలు దేరుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖతో రావాలని అని ఛాలెంజ్ చేశారు. మీరు చెప్పిందే నిజమైతే తప్పకుండా రావాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని మరోసారి ప్రకటించారు. ప్రజలకు మేలు జరిగితే నాకు అంతేచాలని అభిప్రాయపడ్డారు. తాము కొత్త డిమాండ్లు అడగటం లేదని.. ఇచ్చిన హామీలపైనే మాట్లాడుతున్నామని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు రియాక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటనేది రాజకీయవర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే, అడ్డుకోవాలని ప్రయత్నిస్తే దానిని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Tags:    

Similar News