Harish Rao: ‘హైడ్రా’ హైడ్రోజన్ బాంబులా తయారైంది: హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ‘హైడ్రా’ హైడ్రోజన్ బాంబులా తయారైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-28 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ‘హైడ్రా’ హైడ్రోజన్ బాంబులా తయారైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)కు వచ్చిన ‘హైడ్రా’ (HYDRA) బాధితులను ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుందరీకరణ పేరుతో మూసీ నది (Moosi River)లో పేదల రక్తం, కన్నీళ్లను పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసాపైసా.. వెనకేసుకుని కష్టపడి కట్టుకున్న ఇండ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే నిరుపేదలు ఎక్కడి వెళ్లాలని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితురాలు బుచ్చమ్మ ఆత్మహత్య.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అరోపించారు.

రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తుగ్లక్ పనుల వల్ల హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్ ఇమేజ్ (Brand Image) పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చిందని అన్నారు. అనాలోచితంగా సీఎం రేవంత్ (CM Revanth) నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు చేస్తామన్న అంశపై సర్కార్ దృష్టి పేడితే బాగుంటుందని హితువు పలికారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజలంతా అంటు వ్యాధుల బారిన పడుతున్నా పట్టించుకున్న పాపాన పోవట్లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ (KCR) పాలనలో ప్రజలను తాము ఏనాడు ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. అఖిలపక్షాలతో మాట్లాడిన తరువాతే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రక్షణ కవచంలా ఉంటుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.  


Similar News