Telangana Budget 2023 : కేంద్రం వైఖరిపై హరీష్ రావు ఫైర్!
కేంద్రంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పలు అంశాలపై కేంద్రం ఆంక్షలను ఎండగట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం సృష్టిస్తోందన్నారు. జాతీయహోదా కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెండుతోందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పక్కకు పెట్టిందన్నారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. తమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు.
Also Read..
Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం