రుణమాఫీపై నాలుక మడతెట్టిన భట్టి! హరీష్ రావు ఆసక్తకిర ట్వీట్

కాంగ్రెస్‌లో అబద్దాల పోటీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు.

Update: 2024-04-19 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌లో అబద్దాల పోటీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపిత మైందన్నారు. అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టీ.. తాజాగా రుణమాఫీ పై కూడా నాలుక మడత బెట్టారన్నారు.

వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమేనని అన్నారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదమన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని హరీష్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారన్నారు. నిన్న నిరుద్యోగ భృతి పై ఎగవేత -నేడు రైతు రుణ మాఫీ పై దాటవేత ధోరణి కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అని ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు.

Read More...

కాంగ్రెస్ MP అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు 

Tags:    

Similar News