కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేయొద్దు: హరీష్ రావు
బీజేపీకి ఓటెస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి ఓటెస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేయొద్దని ఆయన వెల్లడించారు. పెన్షన్ విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేసి కొత్త సమస్యలను నెత్తిన పెట్టుకోవద్దని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు.