బీజేపీ అభ్యర్థుల్లో సగం మంది ఓడిపోవడం ఖాయం: మాజీ మంత్రి రవీంద్రనాయక్

క్రమశిక్షణకు మారు పేరు, అవినీతికి ఆస్కారం లేని అత్యధిక మెంబర్షిప్ కలిగిన సిద్ధాంతాల పార్టీ అని గొప్పలు చెప్పే బీజేపీ అన్నింటికీ

Update: 2024-03-15 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: క్రమశిక్షణకు మారు పేరు, అవినీతికి ఆస్కారం లేని అత్యధిక మెంబర్షిప్ కలిగిన సిద్ధాంతాల పార్టీ అని గొప్పలు చెప్పే బీజేపీ అన్నింటికీ తిలోదకాలు ఇచ్చి భూకబ్జాదారులకు, అవినీతిపరులకు, పార్టీలోకి చేరిన రోజే పార్లమెంట్ సీట్లిచ్చి నిజమైన కార్యకర్తలకు మొండిచెయ్యి చూపించిందని మాజీ మంత్రి రవీంద్రనాయక్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన వారిలో అత్యధికులు ఓడిపోవడం ఖాయమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాళ్లే తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనేది సత్యమని పేర్కొన్నారు. దేశంలోని 16 పేర్లతో పిలవబడి ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం కలిగిన బంజార, లంబాడీ, సుగాలి మొదలగు తెగలు వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వీజేఎన్‌టీలుగా కొనసాగుతున్నారని, బంజారాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి వారికి న్యాయం చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే తాను బీజేపీకీ రాజీనామా చేసినట్లు చెప్పారు.


Similar News